కరోనా వైరస్.. ఇప్పటికే ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. అలాగే రోజులు గడుస్తోన్న కొద్ది మార్పులు చెందుతూ కొత్త కొత్త వేరియంట్‌లుగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జనాలు జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కొల్పోవడం కరోనా లక్షణాలుగా గుర్తించగా.. జనాలు కూడా అదే లక్షణాలతో హాస్పిటల్ బాట పడుతున్నారు.
అయితే, ఇప్పుడు ఈ లిస్ట్ లో మరికొన్ని కొత్త లక్షణాలు కూడా చేరాయి. కొద్ది మందిలో నాలుక ఎర్రబారడం, ఎండిపోవడం, దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటివి కూడా కరోనా లక్షణాలుగా నిపుణులు గుర్తించారు. ఈ లక్షణాలు ఉంటే తక్షణమే కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలను కొవిడ్ టంగ్ అని చెప్తున్నారు. ఈ లక్షణాలున్న వారిలో నీరసం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే.. కొవిడ్ టంగ్ లక్షణాలకు గల కారణాలు ఎంటి? కరోనా కారణంగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై లోతైన అద్యయనం చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజుకో కొత్త రకం వెలుగులోకి వస్తున్న క్రమంలో జనాలలో ఆందోళన మొదలైంది. ఈ మహమ్మారికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందా ఆలోచిస్తున్నారు.