భారతీయుల నిద్ర నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా మహమ్మారి

Covid-19 changed sleeping pattern of indians survey. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రజలు నిద్రపోయే సమయాల్లో చాలా మార్పులు వచ్చాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 July 2022 7:40 AM GMT
భారతీయుల నిద్ర నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా మహమ్మారి

లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రజలు నిద్రపోయే సమయాల్లో చాలా మార్పులు వచ్చాయి. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా చాలా మంది ప్రజల నిద్రలో మార్పులు వచ్చాయని.. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 52% మంది పౌరులు కోవిడ్ -19 కారణంగా వారి నిద్ర విధానం మారిందని చెప్పారు. మరోవైపు 48% మంది నిద్ర విధానాలలో ఎటువంటి మార్పు లేదని చెప్పారు. కోవిడ్ మహమ్మారి తర్వాత, వారు నిద్రతో పోరాడుతున్నారని.. నిరంతరాయంగా నిద్రపోతున్నారని, స్లీప్ అప్నియాను ఎదుర్కొంటున్నారని, నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారని, ఎక్కువ గంటలు నిద్రపోవాలని భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వ్యక్తులు చెప్పారు.

కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న భారతీయులు తమ నిద్ర మధ్యలో.. మేల్కొనడం.. 3-4 గంటలకు మించి నిద్రపోలేకపోవడం, కొందరు నిద్రిస్తున్నప్పుడు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. ఇంకొందరికి ఉక్కపోతగా అనిపించడం.. అధిక చెమట కూడా ఉన్నట్లు నివేదించారు. మరోవైపు 7% మంది పౌరులు తాము కోవిడ్ బారిన పడనప్పటికీ అప్నియా అభివృద్ధి చెందిందని.. 3% మంది నిద్రపోవడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ప్రజలు సాధారణంగా రాత్రిపూట ఎన్ని గంటలు నిరంతరాయంగా నిద్రపోతారో అర్థం చేసుకోవడానికి లోకల్ సర్కిల్‌స్ సర్వే నిర్వహించాయి.

సర్వేలో భాగంగా.. 23% మంది ప్రజలు నాలుగు గంటల వరకు నిరంతరాయంగా నిద్రపోతామని చెప్పారు, 27% మంది 4-6 గంటలు, 38% మంది 6-8 గంటలు, 6% మంది మాత్రమే 8-10 గంటలు అంతరాయం లేని నిద్ర నిద్ర పొందుతామని చెప్పారు. మొత్తం మీద, ప్రతి ఇద్దరు భారతీయులలో ఒకరు ప్రతి రాత్రి ఆరు గంటల కంటే తక్కువ నిరంతరాయంగా నిద్రపోతున్నారు; 4లో ఒకరు మాత్రమే 4 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారు. ఈ ప్రశ్నకు 20,549 స్పందనలు వచ్చాయి.

తమకు కోవిడ్ రానప్పటికీ, 15% మంది పౌరులు తమ నిద్ర వ్యవధి తగ్గిందని.. 7% మంది స్లీప్ అప్నియా అభివృద్ధి చెందిందన చెప్పారు. కోవిడ్ మహమ్మారి తర్వాత, ప్రజలు నిద్రతో పోరాడుతున్నారని.. నిరంతరాయంగా నిద్రపోయే వ్యవధి తగ్గడం, స్లీప్ అప్నియా, నిద్రపోవడానికి ఇబ్బంది.. ఎక్కువ గంటలు నిద్రపోతూ ఉన్నారని సర్వే కనుగొంది. ఈ ప్రశ్నకు 6,001 స్పందనలు వచ్చాయి.

కోవిడ్ భారతీయుల నిద్ర నాణ్యతపై ప్రభావం చూపింది. ప్రతి ఇద్దరు భారతీయులలో ఒకరు మాత్రమే ప్రతి ఆరు గంటల కంటే తక్కువ నిరంతరాయంగా నిద్రపోతున్నారని.. అయితే నలుగురిలో ఒకరు మాత్రమే 4 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారని సర్వేలో స్పష్టమైంది. కోవిడ్, పోస్ట్ కోవిడ్ రికవరీ దశల్లో ప్రజలు ఏమి అనుభవిస్తున్నారు.. దీనిని పరిష్కరించడానికి ఏమి చేయవచ్చు అనే దానిపై మరింత పరిశోధన అవసరం. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రతి రాత్రి 7 లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story