అతిగా మద్యం తాగే మగవాళ్లు.. జర జాగ్రత్త

Alcohol abuse can change male DNA for three months after stopping. మద్యపానం అన్నదే ఆరోగ్యానికి హానికరం.. ఇక అతిగా మద్యం

By Medi Samrat
Published on : 15 Feb 2021 1:43 PM IST

Alcohol abuse can change male DNA for three months after stopping.

మద్యపానం అన్నదే ఆరోగ్యానికి హానికరం.. ఇక అతిగా మద్యం తాగితే వచ్చే సమస్యలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరో ముప్పు అతిగా మద్యం తాగే వారికి పొంచి ఉందని అంటున్నారు బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) శాస్త్రవేత్తలు.

అతిగా మద్యం తాగే అలవాటు ఉంటే వీలైనంత త్వరగా వదిలిపెడితే బెటర్ అని హెచ్చరిస్తున్నారు. అతిగా మద్యం తాగే వారి డీఎన్ఏలో మార్పులు సంతరించుకుంటాయని.. తొలుత 'ఆల్కహాల్ యూజ్ డిజార్డర్' (ఏయూడీ) తలెత్తుతుందని, ఆ తర్వాత అది పురుషుల డీఎన్ఏలో మార్పులకు కారణమవుతుందని స్పష్టం చేశారు. ఏయూడీ బారినపడిన తర్వాత మద్యానికి దూరంగా ఉన్నప్పటికీ మూడు నెలలపాటు ఏయూడీ కారణంగా వచ్చిన మార్పులు అలానే ఉంటాయని పరిశోధనలో తేలింది.

21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ఈ పరిశోధనలు చేశారు. ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ కారణంగా డీఎన్ఏలో మిథైల్ గ్రూప్స్ వచ్చి చేరుతాయి.. ఇవి డీఎన్ఏలో మార్పులకు కారణమవుతాయి. మన దేశంలో 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 29 శాతం మద్యం తాగుతారని అంచనా. వీరిలో 12 శాతం రోజూ తాగుతారని, 41 శాతం మంది వారానికి ఒకసారి మద్యం తీసుకుంటారని పరిశోధకులు తెలిపారు.


Next Story