కూరగాయల వినియోగంపై సర్వే: పెరిగిన ధరలను తట్టుకోవడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే?

ప్రతి రెండు భారతీయ కుటుంబాల్లో ఒక కుటుంబం గత కొన్ని నెలలుగా టమాటాకు కిలోకు రూ.75 రూపాయలకు పైగా, ఉల్లిపాయలకు 50 రూపాయలకు పైగా, బంగాళదుంపలకు కిలోకు రూ.40 రూపాయలకు పైగా చెల్లిస్తున్నారని తాజా సర్వేలో తేలింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2024 10:43 AM IST
Local circles, Tomato prices, Vegetable prices

కూరగాయల వినియోగంపై సర్వే: పెరిగిన ధరలను తట్టుకోవడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే? 

ప్రతి రెండు భారతీయ కుటుంబాల్లో ఒక కుటుంబం గత కొన్ని నెలలుగా టమాటాకు కిలోకు రూ.75 రూపాయలకు పైగా, ఉల్లిపాయలకు 50 రూపాయలకు పైగా, బంగాళదుంపలకు కిలోకు రూ.40 రూపాయలకు పైగా చెల్లిస్తున్నారని తాజా సర్వేలో తేలింది. సరఫరాలో అంతరాయం, అనేక ప్రాంతాల్లో పంటలకు నష్టం జరిగిన కారణంగా చాలా నగరాల్లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు తక్కువ ధరలకు కూరగాయలు ఎక్కడ దొరుకుతాయా అని ప్రజలు వెతుకుతూ ఉన్నారు.

వేసవి, రుతుపవనాల కాలం వెళ్ళిపోయినా ఉల్లి, టమాటా, పచ్చి ఆకు కూరలు వంటి అనేక రకాల పంటలు హోల్‌సేల్ మార్కెట్‌లలోకి ఎక్కువగా రాకపోవడంతో రిటైల్ మార్కెట్‌లో ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వంటి నగరాల్లో సంస్థలు సబ్సిడీపై ఉల్లిపాయలను అందజేస్తోంది.

కూరగాయల సరఫరాలో అంతరాయం కారణంగా ధర ప్రభావం మార్కెట్లలో చూపిస్తూ ఉంటుంది.

క్రిసిల్ నివేదిక ప్రకారం, ఆల్-ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారంగా వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.49%కి పెరిగింది, అధిక ఆహార ధరల కారణంగా తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి ఇది చేరుకుంది. డిసెంబర్ 2023 తర్వాత అత్యధిక రిటైల్ ద్రవ్యోల్బణం రేటు, ఇది 5.69%. ఆగస్టులో ఇది 3.65 శాతంగా ఉంది. వినియోగదారుల ధరల సూచీ (CPI) సగభాగాన్ని కలిగి ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.66% పెరుగుదలతో పోలిస్తే వార్షికంగా 9.24%కి పెరిగింది. జూలైలో 5.42%, జూన్‌లో 9.36%, మేలో 8.69%, ఏప్రిల్‌లో 8.70%గా నమోదైందని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లీమెంటేషన్ (MoSPI) తెలిపింది.

పెరిగిపోతున్న కూరగాయల ధరలు:

శాఖాహార పదార్థాలు ధరలు ఈ సంవత్సరానికి 11% పెరిగింది. కూరగాయల ధరల పెరుగుదల కారణంగా హోమ్ మేడ్ థాళీ ధరలు పెరిగిపోయాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ లిమిటెడ్ ఒక నివేదికలో పేర్కొంది. ఉల్లి, బంగాళాదుంప, టమాటాతో సహా పలు కూరగాయల ధరలు గణనీయంగా పెరగడం శాఖాహార భోజనం ధర పెరుగుదలకు కారణమని కూడా పేర్కొంది. "సెప్టెంబర్‌లో కూరగాయల ధరలు మిశ్రమ ధోరణులను ప్రదర్శించాయి. ఉల్లి ధరలు 53%, బంగాళదుంపలు 50% మరియు టొమాటోలు 18% పెరిగాయి, భారీ వర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో టమోటా ఉత్పత్తిపై ప్రభావం చూపింది" క్రిసిల్ నివేదిక పేర్కొంది.

లోకల్ సర్కిల్స్ చేసిన ఒక సర్వేలో 2 భారతీయ కుటుంబాలలో ఒక కుటుంబం ప్రధాన కూరగాయల ధరలు పెరిగాయని భావిస్తున్నారు. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టొమాటోతో సహా దాదాపు 37% ఖర్చుతో సహా పలు కూరగాయల ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని కనుగొన్నారు.

ఏ కూరగాయలకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు?

15,260 మంది వినియోగదారులలో 56% మంది టమోటాలు రూ. 75 లేదా అంతకంటే ఎక్కువ, బంగాళాదుంపలు రూ. 40 లేదా అంతకంటే ఎక్కువ, ఉల్లిపాయలు రూ. 50 లేదా అంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 29% మంది టమోటాలు రూ. 50- 75, బంగాళదుంపలు రూ. 30-40, ఉల్లిపాయలు రూ. 40- 50కి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

తగ్గిన కూరగాయల వినియోగం:

సర్వేలో పాల్గొన్న 29% భారతీయ కుటుంబాలు గత కొన్ని నెలల్లో ధరల పెరుగుదలను తట్టుకోవడానికి పచ్చి కూరగాయల వినియోగాన్ని తగ్గించినట్లు చెప్పారు. బడ్జెట్ ఆందోళనల వల్ల బలవంతంగా, కొన్ని కుటుంబాలు నిత్యావసరాల ధరలు పెరగడంతో పలు కూరగాయలను కొనుగోలు చేయడం లేదా వాడకం తగ్గించాయి. బంగాళాదుంప, టొమాటో, ఉల్లిపాయలు, ఇతర కూరగాయల విషయంలో కుటుంబాలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

14,619 మంది వినియోగదారులలో 29% మంది బడ్జెట్‌ పరిధి దాటకుండా ఉండేందుకు ఆయా కూరగాయల వినియోగాన్ని తగ్గించారు, 42% మంది వినియోగాన్ని అలాగే ఉంచారు, కాస్త ఎక్కువ చెల్లించారు. అయితే 29% మంది వినియోగాన్ని అలాగే కొనసాగించారు. కానీ తక్కువ ధరలకు విక్రయించే చోట్ల నుండి కొనుగోలు చేస్తున్నారు.

Next Story