నిజమెంత: ముస్లిం వ్యక్తి ఆహారంలో ఉమ్మేస్తున్నాడా..?

By సుభాష్  Published on  4 April 2020 10:55 AM IST
నిజమెంత: ముస్లిం వ్యక్తి ఆహారంలో ఉమ్మేస్తున్నాడా..?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతోంది. ఓ వైపు కరోనా వైరస్ మీద అందరూ కలిసికట్టుగా యుద్ధం చేస్తూ ఉంటే.. మరో వైపు సోషల్ మీడియాలోనూ, మెసేజింగ్ యాప్ లలోనూ విపరీతంగా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ కొందరు తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. ఈ లిస్టులోకి మరో వీడియో కూడా వచ్చి చేరింది.

45 సెకెండ్ల వీడియోలో రెస్టారెంట్ లో పనిచేసే ఓ వ్యక్తి .. అతడు ముస్లిం అని తెలుస్తోంది.. అతడు ఆ వీడియోలో తినే పదార్థాలపై ఉమ్మేయడం చూడొచ్చు.

Muslim Ma

తబ్లిగ్-జమాత్ ఘటన కారణంగా దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా అక్కడికి వెళ్లి వచ్చిన వారి కారణంగా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ముస్లింలను టార్గెట్ చేస్తూ మెసేజీలను, వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు. మార్చి 2 నుండి అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలైంది. ముస్లింలకు చెందిన రెస్టారెంట్ల నుండి ఏమీ తినకండి అని.. ఇతరులకు ప్యాక్ చేస్తున్న భోజనాల్లో ఉమ్మేస్తున్నారంటూ మెసేజీలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి.

పోస్ కార్డ్ న్యూస్ ఫౌండర్ మహేష్ విక్రమ్ హెగ్డే మార్చి 21 న ట్విట్టర్ లో ఓ వీడియోను అప్లోడ్ చేసినట్లు న్యూస్ మీటర్ కనుక్కుంది. అతడు తన ట్విట్టర్ ఖాతాలో “After looking at this, I’m scared to eat at hotels! Watch the video where a hotel staff spits at food items, before serving it to customers! What’s the use of Janata Curfew when we have deadly sadists like this man? Arrest this lunatic immediately.” అని ట్వీట్ చేశాడు.



ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే "ఈ వీడియోను చూశాక.. నాకు హోటల్స్ లో తినాలంటేనే భయం వేస్తోంది. ఈ వీడియో చూడండి.. హోటల్ స్టాఫ్ తినే పదార్థాలలో ఉమ్మేస్తోంది.. జనతా కర్ఫ్యూను అమలుచేసి ఏమి ప్రయోజనం.. ఇలాంటి శాడిస్టులు ఉండగా.. ఇలాంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని" చెప్పుకొచ్చాడు అతడు. రెండు వేల మందికి పైగా దాన్ని రీట్వీట్ చేశారు.

తెలంగాణ బీజేపీ యూత్ వింగ్ భారతీయ జనతా యువ మోర్చా నాయకుడు రూప్ దారక్, బీజేపీ మద్దతు దారుడు సోనమ్ మహాజన్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. దానిని కూడా 1000 మందికి పైగా రీట్వీట్ చేశారు.

నిజమెంత:

వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్ లను తీసుకుని గూగుల్, యెండెక్స్ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి న్యూస్ మీటర్ కనుక్కుంది ఏమిటంటే ఈ వీడియోను ఏప్రిల్ 27, 2019న యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. ఆల్ట్ న్యూస్ కూడా ఈ వీడియోను ఫ్యాక్ట్ చెక్ చేయగా ఆ వీడియో అప్పటిదేనని కనుక్కుంది. కరోనా వైరస్ ప్రబలడం మొదలయ్యాక పలు దేశాల్లో ఓ కమ్యూనిటీని వ్యతిరేకంగా చూపించాలని ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. భారత్ లో కూడా ఇటీవల ఏ వీడియో బాగా వైరల్ అవుతోంది.



ఆల్ట్ న్యూస్ కథనం ప్రకారం ఈ వీడియో మలేషియా దేశంలో గత ఏడాది వైరల్ అయింది. మే 1, 2019న మలేషియాకు చెందిన లైఫ్ స్టైల్ వెబ్సైట్ Feed Me ఈ వీడియో గురించి రిపోర్ట్ చేసింది. ఆ రెస్టారెంట్ కు సంబంధించిన సరైన సమాచారం లేదు కానీ.. ఏప్రిల్ 26 నుండి వైరల్ అవుతోంది అని చెప్పుకొచ్చారు.

యుఎఈ, సింగపూర్, మలేషియాకు చెందిన కొందరు ఆ వ్యక్తి ప్యాకెట్ లోకి గాలి ఊపుతున్నాడని.. అంతే కానీ విద్వేషంతో ఉమ్మేయడం వంటివి చేయలేదని అంటున్నారు.

రిజల్ట్:

న్యూస్ మీటర్ దగ్గర వీడియో సోర్స్ దొరకలేదు.. కానీ ఈ వీడియో గత ఏడాది నుండే వివిధ దేశాల్లో వైరల్ అవుతూ ఉంది. భారతదేశంలో ఈ వీడియో తబ్లిగ్ జమాత్ ఘటన గురించి వార్తల్లో వచ్చిన వెంటనే వైరల్ అవ్వడం మొదలయ్యింది. ఈ వీడియోకు భారత్ కు ఎటువంటి సంబంధం లేదు.

Next Story