బ్రేకింగ్‌: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ ఉరిశిక్ష రద్దు..!

By సుభాష్  Published on  13 Jan 2020 2:48 PM GMT
బ్రేకింగ్‌: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ ఉరిశిక్ష రద్దు..!

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ మరణ శిక్షణను పాక్‌ హైకోర్టు రద్దు చేసింది. దేశ ద్రోహం కింద కేసు నమోదు కాగా, ఇటీవల పాక్‌ ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఒక వేళ ముషారఫ్‌ ప్రాణాలతో దొరకకపోతే చివరకు శవాన్ని ఈడ్చుకొచ్చి మూడు రోజుల పాటు ఉరి తీయండని తేల్చి చెప్పింది. దీంతో ముషారఫ్‌కు ఉరిశిక్ష ఖరారు కావడంపై ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా, ముషారఫ్‌కు విధించిన ఉరి శిక్షణను సవాలు చేస్తూ ఆయన తరపున లాయర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీంతో హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులతో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆయన పై నమోదైన కేసు నిబంధనలకు విరుద్దంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. మరణ శిక్షణ రద్దు చేస్తూ కోర్టు తేల్చి చెప్పింది. 2007లో రాజ్యాంగాన్ని రద్దు చేసి, దేశంలో ఎమర్జన్సీ విధించారని ముషారఫ్‌పై దేశ ద్రోహం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. 2013 నుంచి కోర్టులో విచారణ కొనసాగుతూ వచ్చింది. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయన స్వేచ్ఛ జీవి అని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి తీర్పు ఉండబోదని ముషారఫ్‌ తరపున న్యాయవాది తెలిపారు.

న్యాయమూర్తులకు గృహ నిర్భంధం:

ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2007లో నవంబర్‌ 3న రాజ్యాంగానికి వ్యతిరేంగా ఎమర్జెన్సీని విధించారు. ఏకంగా దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్భంధం విధించి, అనేక మంది ఉన్నతాధికారులను, న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. న్యాయమూర్తులను విధుల నుంచి తప్పించారు. ఇంతటితో ఆగని ముషారఫ్ మీడియాపై ఆంక్షలు విధించడంతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

నాలుగేళ్లుగా దుబాయ్‌లో …

తర్వాత 2013లో ముషారఫ్‌పై దేశ ద్రోహం కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ కొనసాగుతూ ఉంది. అలాగే 2016లో వైద్యం పేరుతో ముషారఫ్ దుబాయ్ వెళ్లిపోయి నాలుగు సంవత్సరాలుగా అక్కడే తలదాచుకుంటున్నాడు. దీంతో కోర్టు ఆయనకు సమన్లు పంపినా ఏ మాత్రం స్పందించకుండా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయనను వెంటనే అరెస్టు చేయాలని ఎఫ్‌ఐకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం నవంబరు 19న తీర్పును రిజర్వ్‌ లో ఉంచింది. అప్పుడు ఏకంగా మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్‌ను పాక్‌కు తీసుకువచ్చి ఉరి తీయడం అనేది ప్రభుత్వానికి సవాలుగా మారింది. దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. గతంలో పాకిస్తాన్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్‌ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే. ముషారఫ్‌ కు ఉరిశిక్ష విధించిన తర్వాత ఆయనను పాక్‌ కు తీసుకురావడం పోలీసులకు సవాల్‌గా మారింది. నాలుగేళ్లుగా ఇతర దేశాల్లో తలదాచుకుంటున్న ముషారఫ్‌ను ఎలా పట్టుకోవాలనే ప్రశ్న తలెత్తింది. అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్‌ దేశ చరిత్రలో ఇది రెండోసారి. తాజాగా ముషారఫ్‌కు విధించిన ఉరిశిక్షను రద్దు చేసి సంచలన తీర్పునిచ్చింది.

Next Story