గుంటూరులో యువకుడి దారుణ హత్య
By సుభాష్ Published on 19 March 2020 2:46 PM GMT
ఏపీలోని గుంటూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. షేక్ నాగకుమార్ అనే యువకుడి తలపై రోకలిబండతో మోది అతికిరాతకంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. నగరంలోని పట్టాభిపురం భాగ్యనగర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంగా మంగరాజు, పుల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు నాగకుమార్‌పై దాడి చేసి చంపేసినట్లు సమాచారం. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story