వైద్యురాలు హత్య కేసు : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఏమన్నారంటే...

By Newsmeter.Network  Published on  28 Nov 2019 12:12 PM GMT
వైద్యురాలు హత్య కేసు : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఏమన్నారంటే...

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో చటాన్‌పల్లిలో వెటర్నరీ డాక్టర్‌ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. వైద్యురాలుపై పెట్రోల్‌ పోసి నిప్పటించి సజీవదహనం చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె హత్య ఘటనపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హత్య కేసు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. శంషాబాద్‌లో నివాసముండే వైద్యురాలు మహబూబ్‌నగర్‌ జిల్లా నావాబ్‌పేట మండలం కొల్లూరు గ్రామంలో అసిస్టెంట్‌ వెటర్నరీ సర్జన్‌గా పనిచేస్తున్నారు.

విధులు ముగించుకువచ్చిన అనంతరం గడిచిన రాత్రి ఆమె ఇంటి నుంచి బయలుదేరి గచ్చిబౌలికి వెళ్లారు. శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద స్కూటీని ఆపి క్యాబ్‌లో గచ్చిబౌలి వెళ్లారు. చికిత్స కోసం గచ్చిబౌలిలోని చర్మవ్యాధుల వైద్యుడి వద్దకు వెళ్లింది. రాత్రి 9.30 గంటల సమయంలో శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్దకు చేరుకున్న ఆమె, వెహికల్‌ టోల్‌ప్లాజా వద్దకు వచ్చేసరికి ఎవరో వ్యక్తి బండి పంక్చర్‌ అయినట్లు చెప్పాడు.

ఆ వ్యక్తే బండిని పంక్షర్‌ చేయించుకుని వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె అక్కడే నిరీక్షిస్తూ ఉంది. వైద్యురాలును ఎవరు తీసుకెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీపీ వివరించారు. సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు అక్కడ ఉన్నవారిని విచారించాం.

కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయి. ఇది తెలిసినవారు చేశారా? లేదా లారీ వాళ్ల పనా? అనే కోణంలో పరిశీలిస్తున్నాం. త్వరలోనే ఈ కేసును పరిష్కారిస్తాం ఆయన ఆయన మీడియాకు వివరించారు.

Next Story
Share it