విశాఖలోని మర్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భార్యపై భర్త హత్యాయత్నం పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య కోమటి దేవిపై భర్త రమేష్‌ పిడి గుద్దులతో దాడికి పాల్పడ్డాడు. భర్త మాజీ సైనిక ఉద్యోగి. భార్యపై దాడికి పాల్పడటంతో స్థానికులు గమనించి బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న దేవి అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతుంది.

బాధితురాలి కుటుంబ సభ్యులు మర్కాపురం పోలీసుకులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రమేష్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.