తెలంగాణలో మరో సమ్మెకు దిగనున్న కార్మికులు..!

By సుభాష్  Published on  22 Dec 2019 1:41 PM GMT
తెలంగాణలో మరో సమ్మెకు దిగనున్న కార్మికులు..!

తెలంగాణ రాష్ట్రంలో మరో సమ్మె మొదలు కానుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రమంతటా అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా తమ సమస్యను పరిష్కరించాలంటూ మున్సిపల్‌ కార్మికులు జవవరి 8వ తేదీన సమ్మెకు దిగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌కు తెలంగాణ మున్సిపల్‌ వర్కర్లు, ఎంప్లాయిస్‌ యూనియన్‌ నోటీసులు కూడా సమర్పించింది. కాగా, కార్మికుల వేతనాలు కొన్ని నెలలుగా విడుదల కాలేదని, పట్టణ స్థానిక సంస్థలలో కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలులో కొన్ని లోపాలున్నాయని కార్మికులు పేర్కొన్నారు. జీవో 14 ప్రకారం రూ. 12వేలు, 15వేల, 17,500 కేటగిరిల వారిగా వేతనాలను సర్కార్‌ ఖరారు చేసిదని కార్మికులు చెబుతున్నారు. అలాగే కార్మికుల అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని క్రమబద్దికరించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి దీర్ఘాకాలిక సమస్యలన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో సమ్మెకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మున్సిపల్‌ కార్మికులు సమ్మెకు దిగినట్లయితే ఇక నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో మురికితో కంపుకొట్టే అవకాశం ఉంది.

Next Story