ముంబైపై వరుణుడి కరాళ నృత్యం
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 19 Sept 2019 6:46 PM IST

- ముంబై కి మళ్లీ వాన హెచ్చరిక
- ముంబై, రాయ్ గఢ్ లలో రెడ్ అలర్ట్
- స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
- రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలుముంబై: దేశ ఆర్థిక రాజధానిని వాన దేవుడు వదలడం లేదు. కొన్ని నెలలుగా వానలు ముంబైని ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబై రోడ్డు, రవాణా వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ..మళ్లీ ముంబైకి భారీ వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై, రాయ్‌గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ముంబై, ఠానే , కొంకన్ ప్రాంతాల్లో స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
Next Story