కరోనా పంజాలో చిక్కుకున్న ముంబై..దానికి తోడు తుఫాను..

By సుభాష్  Published on  4 Jun 2020 3:15 AM GMT
కరోనా పంజాలో చిక్కుకున్న ముంబై..దానికి తోడు తుఫాను..

దేశ ఆర్థిక రాజధానిగా ఎదిగిన ముంబై..కరోనా పంజాలో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్నది ముంబైలోనే. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 70 వేల పై చిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..2300 మందికి పైగా కరోనాకు బలయ్యారు. తాజాగా నిసర్గ తుఫాన్ తీరం దాటడంతో ముంబై వాసులంతా భయ భ్రాంతులకు గురవుతున్నారు.

కరోనా వైరస్ అత్యంత వేడిలో కూడా బ్రతుకుతూ సామాజిక వ్యాప్తికి దారితీస్తున్న సమయంలో..వరుస తుఫాన్లు దేశంపై దాడి చేస్తున్నాయి. వాతావరణం కొంచెం చల్లబడితే చాలు కరోనా మరింత విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ ముంబై ఒక్క నగరంలోనే 42 వేల పాజిటివ్ కేసులు నమోదవ్వగా..నిన్న ఒక్కరోజే 1109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ముంబై కి దగ్గర్లోనే నిసర్గ తుఫాను తీరం దాటడంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా వాతావరణం చల్లబడటంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోతోంది. దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ప్రజలు పూర్తిగా పట్టించుకోవడమే మానేశారు.

నిసర్గ ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మరో రెండ్రోజుల వరకూ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావంతో కొన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

Next Story