మహిళా ఎంపీటీసీ ఆత్మహత్య..కరోనా వల్లేనా ?
By రాణి Published on 24 April 2020 10:38 PM ISTకరోనా లక్షణాలుంటే చాలు..ఆస్పత్రుల్లో చూపించుకోకుండా ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారు. కానీ ఈ మహిళా ఎంపీటీసీ కరోనా భయంతో ఆత్మహత్య చేసుకోలేదు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆమెకేవో ఆర్థిక ఇబ్బందులున్నాయని తెలుస్తోంది. అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలంలోని జంగాలపల్లి ఎంపీటీసీ సభ్యురాలైన ముడతనపెల్లి స్వరాజ్యం ఏప్రిల్ 21న పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. అంతలోనే విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు ఆగమేఘాలమీద స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అందించేందుకు ఆరోగ్యం ఏమాత్రం సహకరించకపోవడంతో అక్కడి నుంచి హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినా లాభం లేదనుకున్న కుటుంబ సభ్యులు ఆఖరి ప్రయత్నంగా హైదరాబాద్ లో ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇలా మూడు రోజులుగా మూడు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నస్వరాజ్యం గురువారం రాత్రి మరణించారు.
Also Read : బయట తిరుగుతున్న కొడుకుని మందలించిన తండ్రి..క్షణికావేశంలో
ఎంపీడీఓ స్వరాజ్యం పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ మరణించిందని తెలుసుకున్న ములుగు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులు, స్థానికులను ప్రశ్నించగా ఆమె కొంతకాలంగా చేస్తోన్న వ్యాపారంలో నష్టాలొచ్చాయని, అది తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని ఎస్ఐ రాజు వెల్లడించారు. కాగా..కరోనా వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా చాలా వరకూ వ్యాపార పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కొన్ని చిన్న చిన్న వ్యాపారాల్లో ఎన్నడూ లేనంత నష్టాలు రావడంతో చాలా వరకూ వ్యాపారస్తులంతా కుంగుబాటుకు గురవుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నా గతంలో వచ్చినంత లాభాలు రాకపోవచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే రీతిలో ఎంపీడీఓ వ్యాపారానికి కూడా నష్టాలు వచ్చి ఉండొచ్చన్న సందేహాలున్నాయి.
Also Read :చరిత్రలోనే విషాద ఘటన..గర్ల్ ఫ్రెండ్ పై కోపంతో యువకుడు..