బయట తిరుగుతున్న కొడుకుని మందలించిన తండ్రి..క్షణికావేశంలో

By రాణి  Published on  24 April 2020 4:06 PM GMT
బయట తిరుగుతున్న కొడుకుని మందలించిన తండ్రి..క్షణికావేశంలో

  • తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న క్రైం రేటు

కరోనా రక్కసితో పోరాడే మాట అటుంచితే తెలుగు రాష్ట్రాల్లో క్రైం రేటు పెరుగుతోంది. ఆడ పిల్లలపై అఘాయిత్యాలు, లేకపోతే తల్లిదండ్రులు మందలించారన్న కోపంతో క్షణికావేశంలో ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే గుంటూరులో ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతున్న కూతుర్ని (14) తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Also Read : వరుసగా అత్యాచారాలు..తాజాగా గుంటూరులో

కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో మధ్యాహ్నం 12 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఉంది. ఆ తర్వాత ఎవరు బయటికొచ్చినా సరైన సమాధానం లేకపోతే పోలీసులు పనిష్మెంట్లు ఇచ్చి, వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఉప్పరి చెన్నయ్య కొడుకు సాయి (25) తరచూ రాత్రి సమయంలో బయటికెళ్తుండటంతో మందలించాడు. బయటికెళ్తే కరోనా వస్తుందని చెప్తున్నా వినిపించుకోకుండా అలాగే తిరుగుతావేంటని కాస్త గట్టిగా కేకలేయడంతో మనస్తాపానికి గురైన సాయి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. యువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు జీవితం బలైపోతుందనేందుకు ఇదొక నిదర్శనం.

Also Read :లైవ్ స్ట్రీమింగ్ లో అశ్లీల ఫొటోలు..అవి చూసి బ్యాడ్మింటన్ కోచ్ లంతా..

Next Story