అయ్యో.. ధోని సిగ్గు అంతా ఇంతా కాదు.. (వీడియో వైరల్)

By Newsmeter.Network  Published on  28 Jan 2020 2:39 PM GMT
అయ్యో.. ధోని సిగ్గు అంతా ఇంతా కాదు.. (వీడియో వైరల్)

2019 ప్రపంచకప్‌ లో న్యూజిలాండ్‌ తో సెమీ ఫైనల్‌ తరువాత ఇంత వరకు గ్రౌండ్‌ లో అడుగు పెట్టలేదు మహేంద్రసింగ్‌ ధోని. క్రికెట్‌ నుంచి కాస్త విరామం తీసుకున్న ధోని ప్రస్తుతం తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ధోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాజరయ్యాడు. అక్కడ మహేంద్రుడు చేసిన పని ప్రస్తుతం నెటింట్లో వైరల్ గా మారింది.

డౌన్ టూ ఎర్త్‌గా ఉండే ధోనీ అంటే అభిమానుల‌కు చాలా ఇష్టం. తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ధోనీ.. వేదిక ఎక్క‌డానికి చాలా సిగ్గుపడ్డాడు. బాలీవుడ్ సింగ‌ర్ అర్మాన్ మాలిక్ హాజ‌రైన ఓ షోలో ధోనీ త‌న భార్య సాక్షితో క‌లిసి పాల్గొన్నాడు. త‌న జీవిత క‌థ ఆధారంగా నిర్మించిన ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలోని ఓ పాట‌ను మాలిక్ పాడాడు. పాడుతూనే ధోనీని స్టేజ్ పైకి రావాల‌ని కోరాడు. అయితే రెండగుడులు వేసిన ధోనీ.. సిగ్గు ప‌డుతూ స్టేజ్ పైకి ఎక్క‌లేనంటూ మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గాడు. ఈక్ర‌మంలోపాట‌లు పాడించ‌నంటూ మాలిక్ ప్రామిస్ చేయ‌డంతో ధోనీ.. సాక్షితో క‌లిసి స్టేజ్‌పైకి ఎక్కాడు. మాలిక్ పాడిన పాట‌ను ఆస్వాదిస్తూ చ‌ప్ప‌ట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సోష‌ల్ మీడియాలో తాజాగా ఈ వీడియోను పోస్టు చేయ‌గా.. క్ష‌ణాల్లో వైర‌లైంది. ఇంకేముంది అభిమానులు లైక్‌లు, కామెంట్లు, షేర్లతో హోరెత్తించారు.

ఇదిలా ఉంటే ధోని ఎప్పుడెప్పుడు మైదానంలోకి దిగుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే టీ20లో ధోని స్థానం దక్కించుకుంటాడని ఇటీవల కోచ్‌ రవిశాస్త్రి చెప్పిన సంగతి తెలిసిందే. అంతక ముందే ఐపీఎల్ 2020లో ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున బరిలోకి దిగనున్నాడు.

Next Story