ఎంత దారుణం..? అసలు ఏం జరిగింది..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 11:38 AM IST
రంగారెడ్డి: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహానం సంచలం రేపింది. గతంలో ఎన్నడూ..చూడని..వినని పైశాచిక ఘటన అందరిని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. అయితే పట్టపగలు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి విజయారెడ్డిపై దాడి చేసిన సురేష్, విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో తహశీల్దార్ విజయారెడ్డి స్పాట్‌లోనే చనిపోయింది. అయితే ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన డ్రైవర్ గుర్నాథ్‌రెడ్డి, అటెండర్ చంద్రన్నకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు సురేష్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
తహశీల్దార్ విజయారెడ్డి మృతిలో ఆమె ఇంటి వద్ద విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు విజయారెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిని చూస్తే పిల్లలు భయపడతారని ఇద్దరు పిల్లలను కుటుంబ సభ్యులు దూరంగా ఉంచారు.
తహశీల్దార్ విజయారెడ్డి పై దాడి, హత్యను రెవెన్యూ అధికారులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాధికారులపై ఇలాంటి దాడులు చేయడంపై కఠినంగా శికిస్తామన్నారు. అనంతరం విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అపై రెవెన్యూ అధికారుల రక్షణపై ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయారెడ్డి మృతిపై స్పందించిన మంత్రి హరీష్‌రావు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాన్నన్నారు. ప్రభుత్వ అధికారిపై ఇలాంటి దాడి జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి చర్యలు మరల పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి భౌతికకాయానికి ఆర్టీసీ నేతలు నివాళులర్పించారు.