కనుల విందుగా ఎంపీ మాధవి వివాహ వేడుక

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 18 Oct 2019 12:10 PM IST

కనుల విందుగా ఎంపీ మాధవి వివాహ వేడుక

విశాఖపట్నం: వైఎస్ఆర్ సీపీ అరకు ఎంపీ మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్ వివాహం కనుల విందుగా జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ వివాహనికి వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు హాజరయ్యారు. వివాహ వేదిక లైటింగ్‌, పూల అలంకరణలతో ముచ్చట గొలిపింది. ఒక్క మాటలొ చెప్పాలంటే..అరకు లోయ మొత్తం మాధవి పెళ్లి ముచ్చట్లతోనే తెల్లారింది. సంప్రదాయబద్దంగా ఎంపీ మాధవి వివాహం జరిగింది.

ముహూర్తానికి గంట ముందే పెళ్లికుమారుడు వివాహ వేదిక మీదకు చేరుకున్నాడు. అది అక్కడ సంప్రదాయం. పెళ్లి బాజాలు మోగిన తరువాత పెళ్లి కుమార్తె మాధవి వివాహ వేదిక మీదకు వచ్చారు. పెళ్లి సందర్భంగా అరుకులోయలో సందడి వాతావరణం నెలకొంది.

Next Story