హమ్మయ్యా..వాళ్లిద్దరికీ కరోనా లేదు
By రాణి Published on 21 March 2020 6:25 PM ISTవిదేశాల నుంచి వచ్చిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా వైరస్ ఉందనడంలో ఆశ్చర్యం లేదు కానీ..వైరస్ లక్షణాలుంచుకుని కూడా ఓ పార్టీలో అందరితో కలిసి మెలసి తిరగడంపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. ఆ పార్టీలో చాలామంది ఎంపీలతో పాటు మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుశ్యంత్ హాజరు అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పార్టీకి హాజరయ్యాక దుశ్యంత్ పార్లమెంట్ లో తిరిగారు. దీనిపై విపక్షాలు కూడా తీవ్ర విమర్శలు గుప్పించాయి. శనివారం ఎంపీ దుశ్యంత్, వసుంధరా రాజే శాంపిల్స్‌కు సంబంధించి కరోనా రిపోర్టు వచ్చాయి. వీరిద్దరికి కరోనా నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దుశ్యంత్ సింగే ట్విటర్‌లో వెల్లడించారు. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ ముందుజాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోనే ఉంటానని ఆయన వెల్లడించారు.
Also Read : క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన అనుష్క