కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడిన సినిమాలు ఇవే..!

By సుభాష్  Published on  26 March 2020 2:23 PM GMT
కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడిన సినిమాలు ఇవే..!

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ప్రభావం ఎన్నో రంగాలపై పడింది. ఇక సినిమా ఇండస్ట్రీపై కూడా భారీగానే ప్రభావం చూపింది. విడుదల కావాల్సిన చిత్రాలను, షూటింగ్‌లను వాయిదా వేసుకున్నారు. కరోనా దెబ్బతో సినిమా థియేటర్లు సైతం మూత పడ్డాయి. మరీ కరోనా కారణంగా ఏయే సినిమాలు వాయిదా పడ్డాయో చూద్దాం.

వి:

నాని, సుధీర్‌ బాబు హీరోలుగా ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం 'వి' సినిమా ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సి ఉండగా, కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. ఈ సినిమాను ఏప్రిల్‌ లేదా మే నెలలో విడుదల చేసే అవకాశాలున్నాయి.

వకీల్‌ సాబ్‌:

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రీ ఎంట్రీ సినిమా అయిన వకీల్‌ సాబ్‌పై భారీ అంచనాలు ఉండేవి. మే 15న విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్‌కు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా:

బుల్లి తెర యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా చేసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా మార్చి 25న విడుదల కావాల్సి ఉండేది. కరోనా కారణంగా వాయిదా వేసింది చిత్ర బృందం.

ఒరేయ్‌ బుజ్జిగా:

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన చిత్రం ఒరేయ్‌ బుజ్జిగా. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25వ తేదీన విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. తదుపరి విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.

నిశబ్దం:

అనుష్క నటించిన చిత్రం 'నిశబ్దం' ఈ మూవీ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. అయితే కరోనా ప్రభావం వల్ల వాయిదా పడేలా కనిపిస్తోంది. అప్పటి తేదీ వరకు కరోనా ఎఫెక్ట్‌ లేకుంటే విడుదల చేసే అవకాశాలున్నాయి.

నిశ్శబ్ధం:

అనుష్క నటించిన నిశ్శబ్ధం ఎప్రిల్ 2న విడుదల కానుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా నెల రోజులు వాయిదా పడేలా కనిపిస్తుంది.

ఉప్పెన:

మెగా హీరో అల్లుడైన వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన సినిమా ఉప్పెన. ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల చేయాలని చిత్ర బృందం అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విడుదల వాయిదా వేయాలని మైత్రి మూవీ మేకర్స్‌ భావిస్తోంది.

అర్జున్‌:

రాజశేఖర్‌ హీరోగా నటించిన చిత్రం 'అర్జున్‌'. ఈ సినిమా ఇప్పటికే ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు మార్చిలో విడుదల చేయాలని అనుకునే సరికి కరోనా వైరస్‌ అడ్డుపడింది.

శ్రీకారం:

శర్వానంద్‌ హీరోగా, నూతన దర్శకుడు కిషోర్‌ తెరకెక్కించిన చిత్రం 'శ్రీకారం' ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న విడుదల చేయాలని భావించినా.. కరోనా కారణంగా విడుదల చేసేందుకు సందిగ్ధంలో పడింది చిత్ర బృందం.

రెడ్‌:

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా విజయం తర్వాత రామ్‌ పోతినేని హీరోగా నటించిన చిత్రం 'రెడ్'. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 9వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేయగా, కరోనా కారణంగా మే, లేదా జూన్‌కు వాయిదా పడేలా కనిపిస్తోంది.

Next Story