ఈ ఫోటో ఎవరిదో తెలుసా..? ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది
By సుభాష్
అనుపమ పరమేశ్వరన్.. ఈ బ్యూటీ మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో ఎంతో పాపులర్ అయ్యింది. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో సినిమాల్లో కూడా అవకాశం లభించింది. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అది అలా ఉంటే అనుపమ తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిన్ననాటి ఫోటో బుజ్జిగా క్యూట్‌గా ఉంది. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
ఇక అనుపమ పరమేశ్వరన్ ఒక భారతీయ నటి. ఆమె మలయాళతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో 'శతమానం భవతి'లో నిత్యపాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మలయాళ సినిమా 'ప్రేమమ్' లో నివిన్ పౌలీతో కలిసి నటించడం ద్వారా సినీ రంగంలో ప్రవేశించింది. ఈ సినిమా వాణిజ్యపరంగా మంచి విజయం సాధించింది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ మాతృభాష మలయాళమైనా తొలిసారిగా తెలుగు సినిమాలో సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. 2017జనవరిలో విడులైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్‌తో జంటగా నటించింది. ఇలా బ్యూటీకి తెలుగులో కూడా మంచి అవకాశాలే లభించించాయి.