మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదాయ శాఖలో పని చేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

ఇక సామాజిక కోణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిరులో చిరు లుక్ కూడా ఆసక్తిగొలిపేలా ఉంది. అంతేకాకుండా మొన్నటి వరకు ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఓ పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఇతర కారణాల చేత ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇదిలాఉంటే చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిష నటించాల్సి ఉండగా, క్రియేటివ్ డిఫరెన్స్ సెస్ కారణంగా తప్పుకున్నట్లు త్రిష ట్విట్టర్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక త్రిష సైడ్ కావడంతో ఆమె స్థానంలో అందాల భామ కాజల్ ను ఎంపిక చేసిది చిత్ర బృందం.

కాగా, ఈ చిత్రం కోసం కాజల్ ముద్దుగుమ్మ బాగా డిమాండ్ చేస్తోందట. నిజానికి చెప్పాలంటే కాజట్ కు పెద్దగా అవకాశాలు లేవు. అయితే సినిమాలో నటించే పాత్ర రీత్యా నిడివి, ఇతర ప్రాధాన్యతల దృష్ట్యా ఆమె రెమ్యూనరేషన్ బాగా డిమాండ్ చేస్తోందట. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఏకంగా రెండున్నకోట్ల వరకు పారితోషకం అడుగుతోందట. ఇక చిత్రబృందం సంప్రదింపుల మధ్య ఒకటిన్నరకోటికి అంగీరించినట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఆమె సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే కాజల్ కు ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడమే ఎక్కువే. పైగా ప్రస్తుతం అవకాశాలు లేని కాజల్ కు మెగాస్టార్ పక్కన ఛాన్స్ ఇవ్వడం కూడా మరీ ఎక్కువే అనే చెప్పాలి. అయితే ఇంతలోనే కరోనా దెబ్బకు షూటింగ్ కూడా ఆగిపోయింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.