హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో రజిత మిస్సింగ్‌ కేసు.. మర్డర్‌ కేసుగా మారిందని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ప్రియుడి సహాయంతో తల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన కూతురు కీర్తినే హత్య చేసిందని వెల్లడించారు. కీర్తిని స్నేహితుడు బాల్‌రెడ్డి ఫ్రెండ్‌షిప్‌ పేరుతో మోసం చేసి గర్భం చేశాడు, అయితే శశి కుమార్‌ అనే మరో వ్యక్తి ద్వారా కీర్తి అబార్షన్‌ చేయించుకుందని సీపీ తెలిపారు. ఇదే అదనుగా భావించిన శశి కీర్తిని లైంగిక వేధించి ట్రాప్‌ చేశాడు. కీర్తి ఆస్తిపై శశి కన్ను పడింది. శశితో కీర్తి పెళ్లికి తల్లి రజిత ఒప్పుకోకపోవడంతో పథకం ప్రకారం హత్య చేశారు. అనంతరం శశి సహాయంతో కీర్తి తల్లి మృతదేహన్ని రామన్నపేటకి తరలించి రైల్వే ట్రాక్‌పై పడేశారని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. కీర్తిరెడ్డి, శిశికుమార్‌ ప్లాన్‌ ప్రకారమే హత్య చేశారని.. గతంలో రజితకి నిద్ర మాత్రలు ఇచ్చి చంపాలని చూశారని వివరించారు. మొత్తం నాలుగు కేసులు నమోదు చేశామని మహేష్‌ భగవత్‌ తెలిపారు. బాల్‌రెడ్డిపై 376(2)ఎన్‌, 342 సెక్షన్‌ 5,6 పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశాం. శశికుమార్‌, కీర్తిపై 302, 201, 203 రెడ్‌విత్‌ 34 కింద కేసులు నమోదు చేశామని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.