కొడుకుతో కలిసి గోదావరిలో దూకి తల్లి ఆత్మహత్యాయత్నం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 11:16 AM GMTగోదావరిఖని: గోదావరి నదిలో కుమారుడుతో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళను గోదావరి రివర్ పోలీసులు కాపాడారు. మంచిర్యాల జిల్లా పోచమ్మవాడలోని ఇందారంకు చెందిన మినుగు సుజాత, తన కుమారుడితో కలిసి గోదావరి బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా.. గమనించిన గోదావరి రివర్ పోలీస్ టీం ఆమెను కాపాడారు. ఆత్మహత్యకు గల కారణాలను అడుగగా...మినుగు సుజాత తన భర్త మినుగు బాణేష్ మద్యానికి బానిసై రోజు తాగి తనను చిత్రహింసలు పెడుతున్నాడని తెలిపింది. ఈ విషయమై కుటుంబ సభ్యులను ఆశ్రయించంగా..తనకు ఎవరు న్యాయం చేయలేదని, తన ఇబ్బందులు ఎవరు పట్టించుకోవడంలేదని, మానసికంగా కుంగిపోయానిని తెలిపింది. ఈ కారణంతోనే తన కుమారుడు అజయ్‌ని తీసుకొని గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ మేరకు ఆమెను కాపాడిన శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వర్, రివర్ పోలీస్ టీం సుజాతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం తన కుటుంబ సభ్యులను వివరాలు తెలుకొని వారికి అప్పగించారు.