పెసర్లు తింటే ఆ సమయంలో అలసట రాదట..
By అంజి Published on 30 March 2020 5:19 PM ISTశృంగారంలో అత్యంత ప్రధానమైనది సామర్థ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే.. లైంగిక సమయంలో అంత ఆనందాన్ని పొందవచ్చు. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. పోట్రీన్లు సమృద్ధిగా తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని ప్రముఖ డైటీషియన్లు చెబుతున్నారు.
ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా, ధృడంగా ఉండేందుకు పెసర్లు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా పెసర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయట. పెసర్లు తినడం వల్ల శృంగారం సమయంలో అలసట రాకుండా ఉంటుందని, అలాగే శరీరానికి బలం, కండపుష్టి పెరుగుతుందని డైటీషియన్లు అంటున్నారు. పెసర్లు నానబెట్టి తినడం వల్ల జీర్ణశక్తి ప్రక్రియ మెరుగుపడుతంది. ఇంకా నిమ్మరసం, టమాటారసం, ఉసిరికాయరసం, దానిమ్మరసంలో పెసర కట్టును కలిపి తింటే వాతం వ్యాధులు కూడా పూర్తిగా నయమవుతాయి. పెసర్లు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది.
పెసర్లలో ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్‌తో మంచి పోషక విలువలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పెసర్లతో తయారు చేసే మూంగ్‌దాల్‌కు, మొలకెత్తిన పెసర్లకు మంచి డిమాండ్ ఉంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే పెసర్లు చాలా మంది ఇష్టమే.
మీకు తెలుసా..
1.చైనాలో పెసర్లను లుడౌ అని పిలుస్తారు.
2.ప్రపంచమంతా మూంగ్‌దాల్ అని పిలిచే స్నాక్ ఐటమ్ పెసర్లే..
3.పెసర్లు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తాయి..
4.ఐరన్ కంటెంట్ కూడా పెసర్లలో ఎక్కువే..
5.చర్మ సంరక్షణకు పెసర్లలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీసులు చాలు ఉపయోగపడతాయి.
6.డయాబెటీస్‌ను క్రమబద్దీకరించడంలో కూడా పెసర్లు మంచిగా పనిచేస్తాయి.