ఉత్త‌మ‌ సీఎంల‌లో జ‌గ‌న్‌కు మూడో స్థానం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 3:48 AM GMT
ఉత్త‌మ‌ సీఎంల‌లో జ‌గ‌న్‌కు మూడో స్థానం

దేశవ్యాప్తంగా ఉత్త‌మ ప‌నితీరు కన‌బ‌రిచిన‌ ముఖ్యమంత్రుల్లో.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య 'ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌' నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 మధ్య 12,021 మందితో టెలిఫోన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేక‌రించారు.

ఇదిలావుంటే.. యోగి అదిత్యానాథ్ ఉత్త‌మ సీఎంగా మొద‌టి స్థానంలో నిల‌వ‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి. ఇక ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నాలుగో స్థానం, బీహార్ సీఎం నితీష్ కుమార్ 6వ స్థానం, మ‌హ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ తాక్రే 7వ స్థానం, ఒడిస్సా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఎనిమిద‌వ స్థానంలో నిలిచారు.

Next Story