ప్రపంచమంతా ఇప్పుడు కోవిడ్ -19 తో వైరస్ వల్ల భయపడుతుంటే  దక్షిణ భారతదేశంలో మరో వైరస్ విజృభిస్తోంది. మంకీ ఫీవర్ గా కూడా పిలిచే కైసనూర్ ఫారెస్ట్ డిసీస్ ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతోంది.

రాష్ట్రంలో ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నెల రోజుల క్రితం శివమొగ్గకు చెందిన ఓ 58ఏళ్ల మహిళ ఈ వ్యాధికి బలైంది. ఈ ఘటన మరిచేలోపే ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్దపూర తాలూకాకు చెందిన 64 ఏళ్ల భాస్కర్ గణపతి హెగ్దే ఈ మంకీ ఫీవర్ తో ప్రాణాలు కోల్పోయాడు.

Monkey fever karnataka

ఈ ఫీవర్‌ను ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని శివమొగ్గ జిల్లాల్లో తొలిసారిగా గుర్తించారు. అనంతరం ఇది ఉత్తర కన్నడ జిల్లాకు విస్తరించింది. ఒక్క శివమొగ్గలోనే 55మంది ఈ వ్యాధి బారినపడ్డారు. వీరిలో 22మందికి వ్యాక్సీన్లు వేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ సూచనలిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా కర్ణాటకలోని మలెనాడు ప్రాంతంలో ఏప్రిల్ నుంచి మే నెలల మధ్యకాలంలో తరచూ కనిపిస్తుంటుందని, ఈ సారి దీని లక్షణాలు కాస్త ముందే వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

Monkey fever karnataka

తీవ్రమైన జ్వరం, తల నొప్పి, ముక్కు, నోట్లోంచి రక్తం కారడం, వాంతులు, కండరాలు పట్టేయడం,ఒళ్లు నొప్పులు, వణకడం, మానసిక వ్యాకులత వంటి లక్షణాలు ఈ వ్యాధి గలవారిలో కనిపిస్తాయి. చికిత్స తీసుకుంటే రెండువారాల్లో తగ్గిపోతాయి. కానీ ఒళ్లునొప్పులు కొన్ని నెలలపాటు వెంటాడుతాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.