ఆ ఫోటో చూసి ష‌మీ భార్య‌పై మ‌రింత రెచ్చిపోయిన అభిమానులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2020 3:54 PM GMT
ఆ ఫోటో చూసి ష‌మీ భార్య‌పై మ‌రింత రెచ్చిపోయిన అభిమానులు

టీమ్ఇండియా ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ స‌తీమ‌ణి హ‌సిన్ జ‌హాన్ పై నెటీజ‌న్లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫోటోనే అందుకు కార‌ణం.

ఈ మ‌ధ్య హ‌సిన్ బాలీవుడ్ పాట‌ల‌కు హాట్ హాట్‌గా డ్యాన్స్ చేస్తున్న వీడియోల‌తో పాటు ఫోటోల‌ను పోస్టు చేస్తోంది. ష‌మీను మాన‌సిక వేదిన‌కు గురిచేసినందుకు అత‌డి ఫ్యాన్స్ ఆమెను సోష‌ల్ మీడియా వేదిక‌గా దుమ్మెత్తిపోస్తున్నారు. అయిన‌ప్ప‌టికి ఆమె ఆగ‌డం లేదు. త‌న‌పై వేసిన సెటైర్ల‌కు ధైర్యంగా స‌మాధానం చెబుతోంది. మీరు ఒక‌టి అంటే.. నేను రెండు వీడియోలు పోస్టు చేస్తా అన్న చందంగా ఆమె ప‌ద్ద‌తి త‌యారైంది.

తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బోల్డ్ ఫోటోను పోస్టు చేసింది. అందులో మ‌హ్మ‌ద్ ష‌మీతో క‌లిసి న‌గ్నంగా ఉంది హ‌సిన్ జ‌హాన్. 'నీతో ఉన్నంత కాలం నీ అభిమానులందరికీ నేను స్వచ్చమైన వ్యక్తిని. పతివ్రతను. కానీ మీతో విడిపోగానే అపవిత్రురాలిని అయిపోయాను. ఈ మొసలి కన్నీళ్లు కొన్నాళ్లే. మోడల్ హసీన్ జహాన్‌తో క్రికెటర్ మహమ్మద్ షమీ' అని ఆ ఫోటో కింద రాసుకొచ్చింది.

ఇది చూసిన నెటీజ‌న్లు ఆమె పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. రాయ‌లేని ప‌దాల‌తో బూతులు తిడుతున్నారు. మ‌తం, ష‌మీపై గౌర‌వం లేదు నీకు వెంట‌నే ష‌మీకి విడాకులు ఇవ్వు అంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండేళ్ల క్రితం షమీపై హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. షమీకి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని.. అతని కుటుంబం తనను అనేక ఇబ్బందులు గురిచేసిందని, లైంగికంగా కూడా వేదించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలు సమర్పించి క్రికెట్‌లోకి వచ్చాడని ఆరోపించింది.

మ్యాచ్ ఫిక్సింగ్‌, త‌ప్పుడు ప‌త్రాల‌తో క్రికెట్‌లోకి వ‌చ్చాడ‌ని హిసిన్ ఆరోపించ‌డంతో వెంట‌నే బీసీసీఐ రంగంలోకి దిగింది. విచార‌ణ జ‌రిపి ష‌మీ ఎటువంటి త‌ప్పు చేయ‌లేద‌ని అత‌డికి క్లీన్ చిట్ ఇచ్చింది. అదే స‌మ‌యంలో ష‌మీ రోడ్డు ప్ర‌మాదానికి గురైయ్యాడు. స‌రిగ్గా ఐపీఎల్ సీజ‌న్‌కు 10-12 రోజుల‌కు ముందే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రోడ్డు ప్ర‌మాదంతో పాటు త‌న వ్య‌క్తిగ‌త జీవితం మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నాన‌ని ఇటీవ‌ల హిట్ మ్యాన్ రోహిత్‌తో లైవ్‌లో చెప్పాడు ష‌మీ.

Next Story