దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌‌లో రాజకీయ ప్రముఖులంతా చేరుకొని మహాత్ముడికి ఘన నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో జాతిపిత గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సైతం మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు.
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనిల్‌ శాస్త్రి, భాజపా అధ్యక్షుడు జేపీ.నడ్డా నివాళులర్పించిన ప్రముఖుల్లో ఉన్నారు. అనంతరం అక్కడ జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశ స్వాతంత్ర్య సంగ్రామ సారథిగా జనసంద్రాన్ని కదిలించిన మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతిపిత జయంతి ఉత్సవాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.