కరోనా పై ప్రధాని మోదీ ట్వీట్

By రాణి
Published on : 12 March 2020 5:57 PM IST

కరోనా పై ప్రధాని మోదీ ట్వీట్

కరోనా వైరస్ కేసులు భారత్ లో రోజురోజుకూ పెరుగుతుండటంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కరోనా వైరస్ గురించి పలు కీలక సూచనలు చేస్తూ..ట్వీట్ చేశారు మోదీ. కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని..తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించారు. అలాగే రానున్న రోజుల్లో కేంద్రమంత్రులెవరూ విదేశాల పర్యటనకు వెళ్లరని మోదీ ట్వీట్ లో తెలిపారు. ఎవరైనా సరే అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయరాదని, రద్దీగా ఉండే ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిదని సూచించారు. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని కాస్తైనా అరికట్టవచ్చని మోదీ పేర్కొన్నారు.



ఇప్పటి వరకూ కరోనా వైరస్ దాదాపు ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించింది. వైరస్ వ్యాప్తికి మూలమైన చైనాలో ఈ వైరస్ తగ్గుముఖం పడుతున్న తరణంలో..దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ దేశాల్లో వైరస్ బాధితులు, మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా గుర్తించింది. డబ్ల్యూ హెచ్ ఓ చేసిన ఈ ప్రకటనతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. కొన్ని దేశాల్లోని ఎయిర్ పోర్టులు కరోనా లేదని సర్టిఫికేట్ తీసుకువస్తేగానీ ప్రయాణికులను విమానాలు ఎక్కేందుకు అనుమతించడం లేదు. మరోవైపు భారత్ అన్ని టూరిస్ట్ వీసాలను రద్దు చేసింది.

Also Read : టీడీపీ కాలయాపన చేస్తే..వైసీపీ దౌర్జన్యం చేస్తోంది : పవన్ కల్యాణ్

Also Read : ఇటలీ లో చిక్కుపోయిన విద్యార్థులకు ఊరట..స్పందించిన భారత ప్రభుత్వం

Next Story