“హౌడీ మోడి” తరువాత “సావాస్డీ పిఎం మోడి”
By సత్య ప్రియ Published on 2 Nov 2019 8:31 AM GMTప్రధాని మోడి, నవంబర్ 2వ తారీఖు, శనివారం ఉదయం, 3 రోజుల ధాయ్ ల్యాండ్ పర్యటనకై బయలుదేరారు. 14వ తూర్పు ఆసియా సదస్సులో ఆయన పాల్గొననున్నారు. దీంతో పాటు ఆసియన్ ఇండీయా సదస్సులో కూడా ఆయన పాల్గొంటారు.
అయితే, ధాయ్ ల్యాండ్ లో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ రోజు, అంటే శనివారం సాయంత్రం, భారతీయ
కాలమానం ప్రకారం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం పేరు "సావాస్డీ పిఎం మోడి". బ్యాంకాక్ లో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఎంబసీ సహకారంతో థాయ్ లో స్థిరపడిన భారతీయులు నిర్వర్తిస్తున్నారు.
గురునానక్ 550వ జయంతి ని పురస్కరించుకొని జరిగే కార్యక్రమంలో కూడా మోడి పాల్గొంటారు.
ధాయ్ ల్యాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓ చా ఆహ్వానం మేరకు ప్రధాని మోడి బ్యాంకాక్ లో పర్యటిస్తున్నారు. ఆదివారం వారిరువురి మధ్య సమావేశం జరుగనుంది.
Next Story