మహాబలిపురం బీచ్ లో ప్రధాని స్వచ్ భారత్
By సత్య ప్రియ Published on 12 Oct 2019 6:20 AM GMTప్రస్తుతం మహాబలిపురం పర్యటనలో ఉన్న ప్రధాని మోడి, శనివారం తెల్లవారుజామున మహాబలిపురం బీచ్ కి జాగింగ్ కి వెళ్లారు. అయితే, అక్కడి పరిసరాల్లో చెత్త కనిపించడంతో స్వయంగా స్వచ్చభారత్ చేపట్టారు. బీచ్ లో ఉన్న చెత్త తొలగించారు. దాదాపు అరగంట పాటు మోడి బీచ్ ను శుభ్రం చేసారు.
దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. 'మమ్మల్లాపురం బీచ్ లోఉన్న చెత్త ను తొలగించాను. బహిరంగ ప్రదేశాలను స్వచ్చంగా, శుభ్రంగా ఉంచుదాం. మనమంతా ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం.’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు
�
సంబంధిత వార్తలు : https://telugu.newsmeter.in/pm-modi-morning-walk-pics/
�
Next Story