మోదీకి మమత ఇచ్చిన కానుక ఏంటీ?
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 18 Sept 2019 5:59 PM IST

ఢిల్లీ: ప్రధాని మోదీతో ప.బెంగాల్ సీఎం మమత భేటీ అయ్యారు. పీఎం నివాసంలో ఇద్దరు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా మమత తన తరఫున మోదీకి ప్రత్యేక కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించినట్లు సమాచారం. బెంగాల్ రాష్ట్రం పేరు మార్పు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించారని మమత చెప్పారు.
ప్రధాని మోదీ -సీఎం మమత పలు పాలనా రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ప.బెంగాల్‌లోని పలు సమస్యలతోపాటు, ఎన్‌ఆర్‌సీ గురించి కూడా ఇరువురు చర్చించినట్లు సమాచారం. మోదీ ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత మమత మొదటిసారి భేటీ అయింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోదీ - మమత పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ప.బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 19 స్థానాలు గెలుచుకుని సత్తా నిరూపించుకుంది.
Next Story