గాంధీనగర్‌: దేశానికి ప్రధాని అయినా తల్లికి బిడ్డ కాకుండా పోతాడా..!. మోదీ విషయంలో ఈ మాటను మనం కళ్లారా చూడొచ్చు. ఏడాది అంతా బిజీబిజీగా ఉంటారు మోదీ. ఎన్నో పాలనా వ్యవహారాలు, రాజకీయ ఎత్తులు పైఎత్తులు. కాని ..తన పుట్టిన రోజు మాత్రం మోదీ అమ్మ చెంతకు వాలిపోతారు. మనస్ఫూర్తిగా నమస్కారం పెడతారు. మనసారా మాట్లాడుకుంటారు. పుట్టిన రోజు మాత్రం భోజనం అమ్మ హీరాబెన్‌ దగ్గరే. అంతేకాదు..తమ వీధిలో వారితో..చిన్ననాటి స్నేహితులతో ముచ్చటించారు. గాంధీనగర్‌ దగ్గర్లోని రైసిన్ గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి
చిన్న పిల్లవాడిలా మారిపోయారు ప్రధాని మోదీ. పుట్టిన రోజు సందర్భంగా కుమారుడు మోదీకి హీరాబెన్ రూ.501లు బహుమతిగా ఇచ్చింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.