కరోనా వేళ.. హృదయాలను కదిలిస్తున్న శ్రీలేఖ పాట
By తోట వంశీ కుమార్ Published on 22 April 2020 9:33 PM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం దేశ వ్యాప్త లాక్‌డౌన్ ను విధించింది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఇటీవలే మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే.. దినసరి కార్మికులు వలస కూలీలు.. లాక్‌డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి దొరక్క, డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వలసకూలీలు ఇంటికి వెళదాం అనుకుంటే.. రవాణా సౌకర్యాలు లేవు. దీంతో వారి పరిస్థితి అగయ్యగోచరంగా మారింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. కొందరు కాలినడకనే తమ సొంత ఊళ్లకు బయలు దేరారు.
పిల్లలతో కలిసి ఆకలితో అలమటిస్తూ.. సొంతూరుకు ప్రయాణం అయ్యారు. వలస కూలీలపై కన్నీటి గాథపై సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ వలస కూటికోసం కూలి కోసం.. పొట్టబట్టుకు పట్నం వచ్చిన అంటూ.. పాటను పాడింది. రామకృష్ణ కోడూరి సాహిత్యాన్ని అందిచారు. ఈ పాటను విన్న ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కడం ఖాయం.