జేసీ దివాకర్‌రెడ్డికి ఎమ్మెల్యే వార్నింగ్‌..!

By సుభాష్  Published on  21 Dec 2019 4:40 PM GMT
జేసీ దివాకర్‌రెడ్డికి ఎమ్మెల్యే వార్నింగ్‌..!

జేసీ దివాకర్‌రెడ్డిపై నందికొట్కూర్‌ ఎమ్మెల్యే తొగురు అర్థర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం సమావేశంలో చంద్రబాబు సమక్షంలో పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే మరోసారి మాట్లాడు... పోలీసు అంటే ఏంటో చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. పోలీసులంటే అంతనీచంగా కనిపిస్తున్నారా..? నీవు అంత మగాడివైతే నీ చుట్టు పోలీసులను ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించారు.

గన్‌మెన్‌ లేకుండా ఒక్క క్షణం కూడా బయటకు వెళ్లలేవని, అలాంటిది పోలీసులను బూట్లు నాకిస్తానని అంటావా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ ప్రభుత్వం వచ్చినా పోలీసులు విధులు నిర్వహిస్తారని, జేసీ దివాకర్‌ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చంద్రబాబు విచక్షణ లేకుండా ఉన్నాడని మండిపడ్డారు. అనంతపురం పోలీసులు స్పందించి జేసీ, చంద్రబాబులపై కేసు నమోదు చేయాలన్నారు. అలాగే ఇటీవల చంద్రబాబు అసెంబ్లీ ముందు చీఫ్‌ మార్షల్స్‌పై కూడా దురుసుగా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాజీ పోలీసు అధికారిగా అంతు చూస్తానని హెచ్చరించారు.

Next Story
Share it