అప్పట్లో నరకాసుడు..ఇప్పట్లో నారాసుడు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Oct 2019 4:15 PM IST![అప్పట్లో నరకాసుడు..ఇప్పట్లో నారాసుడు: ఎమ్మెల్యే కోటంరెడ్డి అప్పట్లో నరకాసుడు..ఇప్పట్లో నారాసుడు: ఎమ్మెల్యే కోటంరెడ్డి](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/10/kotam.jpg)
తాడేపల్లి: టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇసుక మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఆ కాలంలో ఇసుకసురుల్లా టీడీపీ నేతలు గ్రామాల్లోని ఇసుకను అంతా దోచుకున్నారన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, లోకేష్ సర్వం దోచుకొని..లోటు బడ్జెట్ చూపించారు. దాన్ని సీఎం జగన్ కర్తవ్య దీక్షతో..సడలిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారన్నారు. ఇసుకపై వస్తున్న ఆరోణల్లో నిజం లేదని..ఇసుక విషయంలో అధికారులకు సీఎం స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. కానీ.. ఇలాంటి నేతలు విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం..దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఇసుకను దోచుకున్నారని.. వీరి హయాంలోనే ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ చేస్తున్న దీక్షలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. అసలు మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేష్‌కు తెలియదన్నారు.
చంద్రబాబుకు జీవితమంతా వంచనేని..అప్పట్లో నరకాసుడు..ఇప్పట్లో నారాసుడు..అంటూ కోటంరెడ్డి విమర్శించారు. తండ్రి కొడుకులు ఇద్దరూ..మానసిక వ్యాధితో బాధపడుతున్నారన్నారు. మీడియా పై మాకు ఎప్పుడు గౌరవం ఉంది.జివో 2430 ఎప్పటి నుంచో ఉంది. కొత్తగా పెట్టింది ఏమికాదు..కొన్ని పత్రికలు ఛానెల్స్ ప్రజల్లో అపోహలు సృస్తున్నాయని ఆరోపించారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలి..సాక్షి మీడియా చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నాయకులు ఏమైపోయారని కోటంరెడ్డి ప్రశ్నించారు.