తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2020 11:29 AM GMT
తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌..

తెలంగాణలో మ‌రో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్ప‌టికే.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌లు క‌రోనా బారిన ప‌డ‌గా.. తాజాగా గణేష్ గుప్తా కొవిడ్ బారిన ప‌డ్డారు.

అయితే.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కాంటాక్ట్ కావడంతోనే గ‌ణేష్ గుప్తాకు కరోనా సోకిందని భావిస్తున్నారు. అంతకు ముందు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో కాంటాక్ట్ కావడం వల్లే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికు కోవిడ్ సోకిందనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇదిలావుంటే.. తెలంగాణ‌లో ప్ర‌జా ప్ర‌తినిధుల సిబ్బంది కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స‌తీమ‌ణికి క‌రోనా నెగిటివ్ రాగా.. వంట మనిషి, కారు డ్రైవర్, గన్‌మెన్‌కు కరోనా సోకింది. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డీకి, మంత్రి హరీశ్ రావు వ్యక్తిగత సహాయకుడికి, మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కూడా క‌రోనా పాజిటివ్ రావ‌డంతో పెద్ద సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా హోం క్వారంటైనల్లోకి వెళ్తున్న‌ట్లు తెలుస్తుంది.

Next Story