హైదరాబాద్ : తాను మనసున్నమంత్రినని నిరూపించుకున్నారు సబితాఇంద్రారెడ్డి.
మాడిమ్యాల ఫారెస్ట్‌ లో మంత్రి కాన్వాయ్ వస్తుంది. అక్కడ బైక్‌ను కారు ఢీ కొట్టింది. బైక్‌ మీద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన మంత్రి కాన్వాయ్ ఆపి కిందకి దిగారు. 108  వాహనంలో  గాయపడిన వ్యక్తిని ఎక్కించారు. అతనిని పరామర్శించి ధైర్యం చెప్పారు. దీంతో అక్కడున్న వారు మంత్రి సబితమ్మ మంచి మనసుకు ఫిదా అయిపోయారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.