జువైనల్ హోమ్‌లో సీఎం కేసీఆర్‌ మనవడి క్రిస్మస్‌ వేడుకలు

By సుభాష్  Published on  25 Dec 2019 3:53 PM GMT
జువైనల్ హోమ్‌లో సీఎం కేసీఆర్‌ మనవడి క్రిస్మస్‌ వేడుకలు

హైదరాబాద్‌లో క్రిస్మస్‌ పండగ సందర్భంగా సైదాబాద్‌ జువైనల్‌ హోమ్‌లో కేటీఆర్‌ తనయుడు హిమాన్షు క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హోమ్‌లోని విద్యార్థులు క్రిస్మస్‌ ఆట పాటలతో అందరికి ఆకట్టుకున్నారు. చిన్నారులతో సందడి చేసిన హిమాన్షు కేక్‌ కట్‌ చేసి, చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అందరికి క్రిస్మస్‌ శుభాకాంలు తెలిపారు. ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. ఇలా అందరితో క్రిస్మస్‌ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరి జీవితాలు ప్రేమ, ఆప్యాయతలు ఉండేలా చూడాలని జీసస్‌ను వేడుకుంటున్నట్లు చెప్పారు. హిమాన్షు రాక సందర్భంగా హోమ్‌లో సిబ్బంది, చిన్నారులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story
Share it