అలాంటి వారు సమాజానికే భారం : కేటీఆర్
By రాణి Published on 2 April 2020 2:57 PM ISTసికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ వైద్యులపై దాడి చేసిన ఘటనపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అలాగే నిజామాబాద్ లో కూడా వైద్య సిబ్బందిని అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
'' ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా బాధితులకు వైద్యసేవలందిస్తున్న వైద్యులపై, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు. ఇలాంటి వారు సమాజానికే భారం. రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ గాంధీలో, నిజామాబాద్ లో వైద్య సిబ్బందిపై జరిగిన దాడులను తీవ్రంగా పరిగణిస్తోంది. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటాం '' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
గాంధీ ఆస్పత్రిలో బుధవారం కరోనా పేషెంట్ మృతి చెందగా..అతని సోదరుడు కూడా కరోనా వార్డులోనే చికిత్స పొందుతున్నాడు. వైద్యులు సరైన వైద్యం ఇవ్వకే తన సోదరుడు చనిపోయాడంటూ వైద్యులపై దాడి చేశాడు.
Also Read : కమనీయం..కడు రమణీయం..రాములోరి కల్యాణం