మ‌రికొద్దిసేప‌ట్లో ఢిల్లీ ఫ‌లితాలు సంపూర్ణంగా వెలువ‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే ఆప్ విజ‌యం క‌న్ఫ‌ర్మ్ అయిన నేఫథ్యంలో.. ఆప్ శ్రేణుల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటుతున్నాయి. ఓ బుడతడి ఫోటోను స్మైలీ ఎమోజీతో ‘మఫ్లర్‌మాన్‌’ అనే ట్యాగ్‌ పేరుతో ఆప్ అధికారిక ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేసింది.

త‌మ పార్టీకే సొంత‌మైన‌.. ఆప్‌ ట్రేడ్‌ మార్క్‌ మఫ్లర్‌, టోపీ ధరించి, అచ్చం అరవింద్‌ కేజ్రీవాల్‌లా వున్న ఓ బుడత‌డి ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, నెటిజ‌న్లు లైక్‌లతో పాటు కామెంట్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ మినీ మఫ్లర్‌ మాన్‌ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నెటిజ‌న్లు.. ఏదో ఒక రోజు బుడ‌త‌డు కూడా ఢిల్లీ సీఎం అవుతాడంటూ.. కామెంట్ చేయ‌గా.. నేను కేజ్రీవాల్.. కానీ నేను ఉగ్రవాదిని కాదు’ అని మ‌రోక‌రు ఇలా కామెంట్లు చేస్తూ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆప్‌కు ఓట్లు వేసినందుకు ఢిల్లీ ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇది భారతదేశం ఆత్మను, సారాన్ని రక్షించడానికి ప్రజలు స్పష్టమైన తీర్పని.. హిందుస్తాన్‌, పాకిస్తాన్‌ కోసం కాదు.. స్థిరత్వం కోస ఢిల్లీ ప్రజలు వేసిన ఓటు అని నెటిజ‌న్లు కామెంట్లు అద‌ర‌గొట్టారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.