ఈ బుడ్డోడు ప్రీ స్కూల్ పికాసో..

By అంజి  Published on  11 Jan 2020 1:33 PM GMT
ఈ బుడ్డోడు ప్రీ స్కూల్ పికాసో..

చూస్తే బుడ్డోడిది ఇంకా పాలు కారే ముఖమే. చిదిమితే పాలు కారతాయేమోనన్నట్టుంటాడు. అంతే కాదు. మామూలుగా చూస్తే ఆ వయసు బుడ్డోళ్లెలా ఉంటారో అలాగే ఉంటాడు. చిన్నపిల్లల నవ్వు, చిన్నారిలో ఉండే చిలిపిదనం... అతనికీ ఉంటాయి.

తేడా ఒక్కటే... కుంచె పడితే మాత్రం ఈ బుడ్డోడు మామూలోడు కాడు. కేన్వాస్ మీద రంగులు వేస్తే, బొమ్మలు గీస్తే మహా మహా పెయింటర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. బొమ్మ చూస్తే పాబ్లో పికాసోయే గీశాడేమోనన్నట్టు ఉంటుంది. మికాయిల్ ఆకార్ అనే ఆ బుడ్డోడి పెయింట్లు ఇప్పుడు ప్రపంచమంతటా హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి. మిలియన్ల యూరోలు పలుకుతున్నాయి. జర్మనీలోనే కాదు, అమెరికాలోనే మికాయిల్ ఆకార్ పెయింటింగులంటే పడి చస్తున్నారు. ఆయన పెయింట్లు చూస్తే “ఈ బుడతడు మామూలోడు కాడు. మరో పికాసో”అంటున్నారు ఆర్ట్ క్రిటిక్స్.

Mikail Akar

ఇటీవల అతను వేసిన ఒక పెయిండు పదకొండు వేల యూరోలు పలికింది. ఆ డబ్బును న్యూయర్స్ చిల్డ్రన్స్ చారిటీ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చేశాడు మికాయిల్.

తండ్రి కెరెమ్ ఆకర్ కొన్నేళ్ల క్రితం మికాయిల్ కు పెయింట్ బ్రష్, కేన్వాస్ కొనిచ్చాడు. కొంత సేపటికే బుడతడు పెయింటింగ్స్ తీసుకుని తండ్రి వద్దకు వచ్చాడు. మొదట్లో ఇవన్నీ తన భార్య వేసిందనుకున్నాడాయన. తరువాత ఇవన్నీ కొడుకే వేశాడని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఆయన.

Mikail Akar

పెయింట్ వేసిన తరువాత తండ్రి బాక్సింగ్ గ్లవ్స్ తో కేన్వాస్ ను పంచ్ చేయడం,తద్వారా అద్భుత కళాకృతులను సృష్టించడం మికాయిల్ ప్రత్యేకత. అయితే మికాయిల్ ను పెద్దయ్యాక ఏమౌతావు అని అడిగితే మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ నేను “పుట్ బాల్ ఆటగాడిని కావాలనుకుంటున్నాను” అంటున్నాడట.

Mikail Akar

Next Story