నేలకొరిగిన మరో మిగ్ 21 విమానం
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 25 Sept 2019 3:28 PM IST

గ్వాలియర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన మిగ్21 శిక్షణ విమానం కుప్పకూలింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లూ సురక్షితంగా బయట్పడ్డారు. శిక్షణ నిమిత్తం ఇద్దరు పైలెట్లతో వెళ్తున్న మిగ్ విమానం బుధవారం కూలింది. గ్వాలియర్ ఏయిర్ బేస్ వద్ద, రోజువారీ శిక్షణ నిమిత్తం వారు ప్రయాణిస్తుండగా ఉదయం సుమారు 10 గంటలకు విమానం కూలింది. ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఎయిర్ ఫోర్స్ అధికారులు స్థానికులు సహాయంతో సహాయ చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
Next Story