హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. భారత్‌లో ప్రస్తుత పరిణామాలు విచారకరమన్నారు. బజ్‌ఫీడ్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో నాదెల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారత్‌కు వచ్చే బంగ్లాదేశ్‌ వలసదారుడు ఇన్ఫోసిస్‌ తదుపరి సీఈవో అయితే చూడాలని ఉందన్నారు. ఇది మంచిది కాదని అని కూడా నాదెళ్ల అభిప్రాయపడ్డారు. పలువురు స్వాగతించే చర్యగా సత్యనాదెల్ల సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి నాదెళ్ల ఇలా స్పందించారా తెలియాల్సి ఉంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా అక్కడి బహుళ సంస్కృతిక మూలాలను ప్రస్తావించడం ఎప్పుడు మర్చిపోలేదని నాదెళ్ల అన్నారు. భారతదేశం ఎదగడానికి గొప్ప ప్రదేశంగా తాను భావించానని, తాను క్రిస్మస్‌, దీపావళి, రంజాన్ మూడు పెద్ద పండుగులను జరుపుకుంటానని తెలిపారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులపై విచారంగా ఉందన్నారు. ఇప్పటికే దేశం సీఏఏ ఆందోళనలతో హింసాత్మకంగా మారింది.

వలసదారులు, శరణార్థులపై నాదెళ్ల తన వైఖరిని సృష్టం చేశారు. ప్రతి దేశం తన సొంత జాతీయ భద్రత గురించి పట్టించుకుంటుందన్నారు. దేశాలకు సరిహద్దులు ఉన్నాయని, అవి నిజమైనవని వాటి గురించి ప్రజలు ఆలోచిస్తారని నాదెళ్ల పేర్కొన్నారు. కాగా చట్టబద్ధమైన వలస విధానం గురించే నాదెళ్ల వాఖ్యానించారని, ప్రతిభావంతులు ఏ దేశాలకైనా అనేక విధాల సాయపడగలరన్నది తన ఉద్దేశంగా తెలుస్తోంది. అమెరికా జర్నలిస్ట్‌ నాదెళ్ల వ్యాఖ్యాలను పంచుకున్న కొద్దిసేపటికేజజ మైక్రోసాఫ్ట్‌ సీఈవోకి ట్యాగ్‌ చేస్తూ ఒక ప్రకటనను ట్వీట్‌ చేసింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.