నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది బబ్లీ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జా. ఆ తరువాత మారుతీ దర్శకత్వంలో శర్వానంద్ సరసన చేసిన ‘మహానుభావుడు’ చిత్రం కూడా హిట్ కావడంతో వరుస అవకాశాలు పట్టేసింది. ఐతే ఆ తరువాత మెహ్రీన్ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. ఈ ఏడాది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ తో మెహ్రీన్ ప్రారంభించింది. వెంకటేష్, వరుణ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎఫ్ 2’ బంపర్ హిట్ అందుకుంది. కాగా ఆమె ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన ‘ఎంతమంచివాడవురా’ చిత్రంలో నటిస్తుంది.

Mahreen2

పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ ఆన్ లొకేషన్స్ స్టిల్స్ కొన్ని బయటకి వచ్చాయి. వాటిలో మెహ్రీన్ లంగా ఓణీలో పక్కా పల్లెటూరి అమాయకపు అమ్మాయిగా క్యూట్ గా ఉంది. సీనియర్ నటి సుహాసిని తో కలిసి వున్న మెహ్రీన్ లుక్స్ చూస్తుంటే ఆమె పాత్ర ఈ మూవీలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎంత మంచివాడవురా చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.