మేఘాలయాలో ఐఏఎస్ అధికారి..10కి.మీ నడిచి వెళ్లి కూరగాయలు కొంటాడు..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 7:06 AM GMT
మేఘాలయాలో ఐఏఎస్ అధికారి..10కి.మీ నడిచి వెళ్లి కూరగాయలు కొంటాడు..!!

మేఘాలయా: ఒక ఐఏఎస్ ఆఫీసర్, పైగా డిప్యూటీ కమిషనర్‌ అంటే ఎంత హోదా, ఎంత దర్పం. అసలు సమయం వుండదు, కుటుంబంతో కలిసి ఉండేది అంతంతమాత్రమే. ఇక కూరగాయల షాపింగా?? సరేసరి. కాని.. ఆయన అలా కాదు. భార్యతో కలిసి వారానికి ఒకసారి పది కిలోమీటర్లు నడిచి వెళ్లి బుట్టలో కూరగాయలు కొనుక్కువస్తాడు.

ప్లాటిక్ సంచులను వాడకుండా, ప్రాంతీయంగా చేసిన వెదురు బుట్టలో కూరగాయలు మోసుకు వస్తాడు. ఆయనే మేఘాలయాకు చెందిన వెస్ట్ గారో హిల్స్ కమిషనర్ రామ్‌సింగ్.

21కేజీల సేంద్రీయంగా పండించిన కూరగాయలు కొంటారు.. ఇతర సామగ్రి కూడా కొనుక్కుంటారు. ప్లాటిక్ సంచులు వాడకుండా, ట్రాఫిక్ కష్టాలు లేకుండా హాయిగా 10 హాయిగా నడుస్తారు. "ఫిట్ ఇండియా, ఫిట్ మేఘాలయా" అంటూ రామ్‌సింగ్ తన ఫేస్‌ బుక్‌లో భార్యతో కలిసి దిగిన చిత్రాన్ని చూసి సోషల్ మీడియా అంతా శభాష్ అంటోంది. "ఇలాంటి ఆలోచనా విధానం అందరికి స్ఫూర్తిదాయకం, అయనని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం" అని అంటున్నారు నెటిజన్లు.

“నేను ఇలా గత ఆరు నెలల నుంచి చేస్తున్నాను, అందరూ గతుకుల రోడ్లపైన కూరగాయలు మొయ్యడం చాలా కష్టంగా ఉందని అంటున్నారు, నేను వెదురు బుట్టని వాడండి అంటే నవ్వుతున్నారు. అందుకే నేనే వారందరికి చేసి చూపిస్తున్నాను. అన్ని ఆధునిక సమస్యలకి పరిష్కారం మన సాంప్రదాయాలలో దొరుకుతుంది" అని అంటున్నారు ఐఏఎస్‌ శ్రీ రామ్‌సింగ్.

Next Story