కరోనాని తరిమేస్తాం అంటున్న మెగా ఫ్యామిలీ..
By రాణి Published on 15 April 2020 2:54 PM IST- క్రిమిని కాదు..ప్రేమను పంచుతాం
కరోనా ఈ పేరు వింటే చాలు..చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ వణికిపోతున్నారు. గుమ్మం దాటి అడుగు బయట పెట్టాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఏప్రిల్ 15, బుధవారానికి మనదేశంలో 11,439 కేసులుండగా 1306 మంది కోలుకున్నారు. మరో 377 మంది మృతి చెందారు. సరిగ్గా నెలరోజుల క్రితం అంటే మార్చి 15వ తేదీన భారత్ లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 114 కాగా వీటిలో ఒక్క కాంటాక్ట్ కేసు కూడా నమోదవ్వలేదు. కొందరు విదేశీయులు కాగా..మరికొందరు విదేశీ రిటర్న్. కేవలం నెలరోజుల వ్యవధిలోనే మనదేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకటి 10 రెట్లు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మార్చి 15 వరకూ 1,60,000 కరోనా కేసులుంటే ఇప్పుడు ఆ సంఖ్య 20 లక్షలకు చేరువలో ఉంది.
Also Read : ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో ఊహించని షాక్
కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రాలను ఆదుకునేందుకు ఇప్పటికే టాలీవుడ్ తారాగణం కదిలొచ్చింది. లక్షలు, కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారు ప్రముఖులు. మరికొందరు అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నారు. రకుల్ ప్రీత్, రష్మి గౌతమ్ వంటి సెలబ్రిటీలు నిత్యం కొన్ని వందల మందికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. తాజాగా..కరోనా పై అవగాహన కల్పిస్తూ, కరోనా పై పోరాటానికి మేము సైతం అంటూ ముందుకొచ్చింది మెగా ఫ్యామిలీ.
Also Read : బతుకు బలైపోయిన బండి..శ్రీముఖి కొత్త అవతారం
ఇంట్లో ఉంటాం..యుద్ధం చేస్తాం..క్రిమిని కాదు ప్రేమను పంచుతాం..కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం, భారతీయులు ఒక్కటై భారత్ ను గెలిపిస్తాం అంటూ మెగా ఫ్యామిలీ కి చెందిన చిరంజీవి,అల్లు అరవింద్, రామ్ చరణ్, ఉపాసన, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజీ, నిహారిక, చిరంజీవి కూతురు, అల్లుడు , వరుణ్ తేజ్, నాగబాబు ఇలా ఒక్కొక్కరు ఒక్కో ప్లకార్డును చేతపట్టి నెట్టింట్లో అవగాహన కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.