• ఇంగ్లీష్ మీడియం పై ప్రభుత్వ జీవో రద్దు

ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో ఊహించని షాక్ తగిలింది. గతంలో విద్యార్థులు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హై కోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 81,85 ను రద్దు చేసింది ఉన్నత న్యాయస్థానం. విద్యార్థులు ఏ మీడియం (మాతృభాష, ఇంగ్లీష్ )చదవాలనుకుంటున్నారో దానిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, హక్కు వారికి ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదని హై కోర్టు అక్షింతలేసింది.

వైరల్ : పిల్లాడికి బర్త్ డే విషెస్ చెప్పిన పోలీసులు..ఎందుకో మీరే చూడండి

కాగా.. రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేస్తూ తీర్మానించింది. దీనిని ప్రతిపక్షాలు అప్పుడే వ్యతిరేకించినా..భవిష్యత్ లో ఇంగ్లీష్ పై పట్టు అవసరమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే సీఎం జగన్ కు మాతృభాషపై ప్రేమ లేదన్న విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి. తెలుగు తో పాటే ఇంగ్లీష్ కూడా ఉంటుందన్న ప్రభుత్వం..తెలుగు మినహా మిగతా సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్ లోనే ఉంటాయన్న ధోరణిలో మాట్లాడింది.

బతుకు బలైపోయిన బండి..శ్రీముఖి కొత్త అవతారం

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.