వైరల్ : పిల్లాడికి బర్త్ డే విషెస్ చెప్పిన పోలీసులు..ఎందుకో మీరే చూడండి

By రాణి  Published on  15 April 2020 7:02 AM GMT
వైరల్ : పిల్లాడికి బర్త్ డే విషెస్ చెప్పిన పోలీసులు..ఎందుకో మీరే చూడండి

కరోనా వైరస్ కారణంగా ఒక్క భారత్ లోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పీడిత దేశాల్లో ఎలాంటి ఫంక్షన్లు జరగడం లేదు. పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు..ఆఖరికి చనిపోయిన వారికి పెద్దకర్మలు చేసే ఆస్కారం కూడా లేదు. ఇలాంటి సమయంలో ఓ పిల్లాడి పుట్టిన రోజునాడు పోలీసులు అతని ఇంటి ముందుకెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకో తెలుసా ? అతని తండ్రి పోలీసులకు ఫోన్ చేసి..ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు. ప్రతి ఏడాది తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం కానీ..ఈ సారి మాత్రం కరోనా కారణంగా ఒక్కరు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి రాలేదు అని చెప్పాడట. ఇది విన్న పోలీసులు ఊహించని పద్ధతిలో రియాక్ట్ అయ్యారు. డ్యూటీలో ఉన్న పోలీసులు వాహనాల్లో ఆ పిల్లాడి ఇంటి ముందుకెళ్లి వాహనాల్లోనే ఉండి హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ సైరన్ సౌండ్ వచ్చే మైక్ సిస్టమ్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో ఆ పిల్లాడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read : బతుకు బలైపోయిన బండి..శ్రీముఖి కొత్త అవతారం

పోలీసుల వాహనాలను చూడగానే కేరింతలతో చప్పట్లు కొట్టాడు. తర్వాత తండ్రి ఎలా ఉంది అని అడగగా..చాలా స్పెషల్ గా ఉంది. థ్రిల్లింగ్ గా అనిపించింది. థాంక్యూ డాడీ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇదంతా జరిగింది అమెరికాలో. నిజంగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఓ పిల్లాడి ఆనందం కోసం పోలీసులు ఇంత సాహసం చేశారంటే నమ్మశక్యం కాని విషయం.

Next Story