'మీకు మాత్ర‌మే చెప్తా' ఫ‌స్ట్ వీకెండ్ ఎంత క‌లెక్ట్ చేసిందో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 7:37 AM GMT
మీకు మాత్ర‌మే చెప్తా ఫ‌స్ట్ వీకెండ్ ఎంత క‌లెక్ట్ చేసిందో తెలుసా..?

టాలీవుడ్ యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి తన కింగ్ ఆఫ్ హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’.

ఈ సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్‌ హీరోగా, షామీర్‌ సుల్తాన్‌ను దర్శకుడిగా పరిచయం అయ్యారు.

వాణి భోజన్, అభినవ్ గోమఠం, అనసూయ భరద్వాజ్, అవంతిక మిశ్రా, వినయ్‌ వర్మ, నవీన్‌ జార్జ్‌ థామస్‌, పావని గంగిరెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ కుమార్ సంగీతం అందించారు.

ఇక నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలిరోజు నుండే మంచి సక్సెస్ టాక్‌తో ముందుకు సాగుతోంది.

ఇకపోతే మొదటి వీకెండ్ లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.4.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు కాసేపటి క్రితం ఒక ప్రకటన రావడం జరిగింది.

తన తండ్రి వర్ధన్ దేవరకొండతో కలిసి నిర్మించిన తొలి సినిమానే మంచి సక్సెస్ సాధించడంతో విజయ్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెంతమేర కొల్లగొడుతుందో చూడాలి.

Next Story